Tuesday, May 14, 2024
- Advertisement -

ప్ర‌కాష్ రాజ్ నాతో బాయ్‌ఫ్రెండ్‌గా చేస్తారేమో…!

- Advertisement -

హీరో రామ్‌,అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన సినిమా ‘హలో గురు ప్రేమకోసమే..’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం నాడు హైదారాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు. ఈ ఫంక్ష‌న్‌లో బ్లాక్ డ్రెస్‌తో ప్రధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది హీరోయిన్ అనుపమ. ఈ సంద‌ర్భంగా అనుమ‌ప మాట్లాడుతు …‘శతమానం భవతి’ చిత్రం తరువాత నిర్మాత దిల్ రాజుతో చేసిన రెండో సినిమా ఇది.

ఇంత మంచి టీంతో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన చాలా ఫన్నీగా ఉంటారు. నన్ను షూట్‌లో బాగా ఏడిపించేవారు. ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పాలంటే.. ఆయన ‘శతమానం భవతి’ చిత్రంలో నాకు గ్రాండ్ ఫాదర్ చేశారు. ఈ సినిమాలో ఫాదర్‌గా నటించారు. నెక్స్ట్ సినిమాలో నా బాయ్ ఫ్రెండ్‌గా చేసినా చేస్తారు. అంత యంగ్‌గా కనిపిస్తారాయన. ఆయన అద్భుతమైన నటుడు.. షూటింగ్‌లో చాలా విలువైన సలహాలు ఇస్తారు. గ‌త కొన్ని రోజులుగా మీడియాలో ప్రకాష్ రాజ్‌కు అనుప‌మ‌కు మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.త‌రువాత వీరిద్ద‌రు అలాంటిది ఏం లేద‌ని తెల‌ప‌డం జ‌రిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -