Thursday, May 9, 2024
- Advertisement -

ఇళయరాజా బయోపిక్‌లో కోలీవుడ్ స్టార్ హీరో!

- Advertisement -

వెండితెరపై మరో బయోపిక్ రానుంది. ఇప్పటివరకు సినీ,క్రీడా,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు రాగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. తాజాగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రానుంది. ఈ బయోపిక్‌లో తమిళ ఇండస్ట్రీ అగ్రహీరో ధనుష్‌ నటించనున్నట్లు సమాచారం.

దక్షిణాదినా ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించారు. అందుకే సంగీత ప్రపంచంలో మ్యూజిక్ మ్యాస్ట్రోగా గుర్తింపు పొందారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో సేవలు అందించిన ఆయన వెయ్యి సినిమాలకు పైగా సంగీతం అందించారు. అందుకే ఆయన బయోపిక్ ప్రేక్షకుల ముందుకురానుండగా ఇందులో ధనుష్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. 2024లో సినిమా పట్టాలెక్కనుండగా 2025లో రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు మ్యాస్ట్రో అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా తన తన తండ్రి పాత్రలో ధనుష్ నటిస్తుండటం సంతోషంగా ఉందని ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా చెప్పారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ధనుష్ స్వీయ దర్శకత్వంలో డీ 50తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ రెండు పూర్తయిన తర్వాత ఇళయరాజా బయోపిక్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -