Friday, March 29, 2024
- Advertisement -

హీరో గోపిచంద్‌కు యాక్సిడెంట్‌…ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

- Advertisement -

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపిచంద్‌కు గాయాలు అయిన‌ట్లు తెలుస్తోంది. షూటింగ్‌లో భాగంగా గోపించ‌ద్ ఓ సీన్ చేస్తుంటే గాయం అయిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం గోపిచంద్ త‌న కొత్త సినిమా షూటింగ్ బెంగళూరు జయపుర సమీపంలో జ‌రుగుతుంది. సినిమాలోని కీలక ఫైట్ సీన్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

బైక్ పై ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా గోపీచంద్ బైక్‌పై నుంచి కింద‌ప‌డిన‌ట్లు షూటింగ్ స‌భ్యులు తెలిపారు. వెంట‌నే ఆయ‌న‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. గోపిచంద్‌ను ప‌రిశీలించిన డాక్ట‌ర్లు చిన్న గాయాలే అయ్యాయని తెల‌ప‌డంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌థ‌మ చికిత్స అనంతరం గోపిచంద్‌ను హైద‌రాబాద్ తీసుకురానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -