Friday, April 26, 2024
- Advertisement -

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కాలుకి శస్త్ర చికిత్స!

- Advertisement -

ప్రముఖ నటుడు కమల్ హాసన్ కాలుకి శస్త్ర చికిత్స జరిగింది. చెన్నైలోని శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో వైద్యులు కాలికి శస్త్ర‌ చికిత్స చేశారు. ఈ నేప‌థ్యంలో ఆ ఆస్పత్రి క‌మ‌ల‌హాస‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. కుడి కాలు బోనుకి స్వ‌ల్ప‌ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో క‌మ‌ల‌హాస‌న్ చేరార‌ని వైద్యులు వివ‌రించారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. గతంలో కూడా కమల్ హాసన్ కి పలు గాయాలు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అన్నారు వైద్యులు.

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న నేప‌థ్యంలో క‌మ‌ల‌హాస‌న్ కొన్ని నెల‌లుగా ఈ విష‌యంపైనే దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు మొదలు పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -