Wednesday, April 24, 2024
- Advertisement -

హీరో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రారంభం!

- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 చిత్రంలో నటించిన ప్రభాస్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాలపై మంచి క్రేజ్ వచ్చింది. ఆ మద్య సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సాహో’ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మద్య పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘సాహెూ’ చిత్రం అంచనాలు తప్పింది.

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీ తర్వాత బాలీవుడ్ లో ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నాడు. ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ సినిమా కావడంతో దీనికి మరింత క్రేజ్ ఏర్పడింది. కాగా, ఈ రోజు ఈ చిత్రం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ముందుగా వీఎఫ్ఎక్స్ పనులను మొదలెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియా మాధ్యమంగా వెల్లడిస్తూ, ‘మోషన్ క్యాప్చర్  ప్రారంభమైంది. ఆదిపురుష్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో పడ్డాం..’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో పాటుగా చిత్రానికి పనిచేస్తున్న వీఎఫ్ఎక్స్ టీమ్ సభ్యులతో కలసి తాను దిగిన ఫొటోను కూడా దర్శకుడు పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు సయీఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -