ప్రిన్స్ మహేష్ బాబు. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనే పేరొందిన స్టార్ హీరో. నేషనల్ వైడ్ కార్పొరేట్ యాడ్స్ తో కాస్త హడావిడి చేసే సైలెంట్ హీరో. ఈయన గారి లుక్ కు ఎందరో అమ్మాయిలు పడిపోయారు.
ఒక్క అమ్మాయిలనే కాదు….. సౌత్, బిటౌన్ దర్శకులు కూడా పడిపోయారనేది మహేష్ సన్నిహితులు, వెల్ విషర్స్ చెప్పే మాట. అలాంటి సందర్బంలో మహేష్ వారితో ఎందుకు కలిసి పని చేయడు అంటే మాత్రం…. రిప్లై ఉండదు. పదే పదే అడిగితే మహేష్ కు అలా చేయడం ఇంట్రెస్ట్ ఉండదు అంటారు.
ముందు నుంచి మహేష్ కు ఎందుకో…. బయటివారితో సినిమాలంటే అస్సలిష్టముండదు. ఒక వేల ఇష్టపడి ఏమైనా వర్కవుట్ చేద్దామని ట్రై చేసినా…అది అనుకున్నట్లుగా వచ్చి చావదు. అందుకే తనకు నచ్చని బ్యాచ్ ను….
తన దగ్గరికి కూడా రానీయడంలేదు. మ్యాటర్ లోకొస్తే… మహేష్ కు కోలీవుడ్ దర్శకులంటే ఇష్టమే. అయితే ఎంతో ప్రెస్టీజియస్ చిత్రమనుకున్న నాని ఫ్లాప్ కావడం….అప్పట్లో అతన్ని భాగా డిజప్పాయింట్ చేసింది. తనని ఇంట్లో అందరూ పిలిచే ముద్దుపేరు నానిని సినిమాకు టైటిల్ గా పెడితే ..ఎస్ జే సూర్య దానిని ఇలా కిల్ చేస్తాడా అని చాలా ఫీల్ అయ్యాడట. అప్పటినుంచి అరవ బ్యాచ్ ను మొత్తాన్ని పక్కన పెట్టేశాడు.
నిజానికి మహేష్ బాబుతో సినిమా చేయడానికి కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్ లు ఆసక్తి చూపుతున్నారు. వారు మన శ్రీమంతుడు కోసం రెడ్ కార్పెట్ పరిచి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మహేష్ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అరవ డైరెక్టర్లకు కూడా ప్రిన్స్ అంటే మస్త్ మోజుంది. లింగుస్వామి గతంలో గట్టిగా ట్రై చేశాడు. నో యూజ్. ఇపుడు మురుగదాస్ మహేష్ తో సినిమా చేయడానికి ఆసక్తితోనే ఉన్నాడు. మరి మహష్ గతంలో అరవ బ్యాచ్ కు చెప్పినట్లుగాను మురుగాదాస్ కు కూడా నో చెబుతాడా లేక యస్ అంటాడా అన్నది చూడాలి.