Sunday, May 19, 2024
- Advertisement -

‘బిగ్ బాస్’ సీజన్ -2 వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ స్థానంలో హీరో నాని..?

- Advertisement -

వరుస విజయాలతో జోరుమీదున్నారు యువ కథానాయకుడు నాని. ‘అ!’ చిత్రంతో నిర్మాతగా కొత్త బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించారు. ఇక త్వరలోనే నాని మరో కొత్త పాత్రలోఅల‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను అలరించిన షో ‘బిగ్‌బాస్ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు మంచి ఆదరణే లభించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ‘బిగ్‌బాస్ సీజన్‌-2’ను ప్రారంభించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. అయితే సీజన్‌-2కు వ్యాఖ్యాతగా వ్యవహరించ‌డానికి ఎన్టీఆర్ నిరాక‌రించ‌డంతో న్యాచుర‌ల్ స్టార్ నాని వ్య‌వ‌హ‌రిస్తార‌నే టాక్‌ వినిపిస్తోంది.

బిగ్‌బాస్‌ సీజన్‌-’లో ప్రధాన ఆకర్షణ ఎన్టీఆర్‌. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ తన హావభావాలతో, డైలాగ్స్ తో ఆ షోను ఎంతో రక్తికట్టించాడు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-2’ డేట్లు సర్దుబాటు చేసే అవకాశం లేకుండా పోవడంతో వ్యాఖ్యాతగా వ్యవహరించలేనని నిర్వహకులకు చెప్పేశారట.

ఎన్టీఆర్ నో చెప్ప‌డంతో షాక్ తిన్న షో నిర్వాహ‌కుల ఆలోచ‌న నానిమీద‌కు మ‌ళ్లిందంట . వెండితెరపై తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని.. అభిమానులతో‘నేచురల్‌స్టార్‌’ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు.యువ‌త‌లో నానికి మంచి పేరుంది. ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానా తో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అందుకే త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -