Monday, May 13, 2024
- Advertisement -

భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించిన భార‌త్‌ …స‌ఫారీలు రికార్డును కాపాడుకుంటారా..?

- Advertisement -

జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. బ్యాట్స్‌మేన్‌ల దూకుడుకు స‌ఫారీ బౌల‌ర్లు అడ్డుక‌ట్ట‌వేయ‌లేక‌పోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (39 బంతుల్లో 72; 2×6, 10×4) వీర విహారం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన భారత బ్యాట్స్‌మెన్ ప్రొటీస్‌కు భారీ లక్ష్యాన్నే నిర్దేశించారు. అయితే జోహన్నెస్‌బర్గ్‌లో ఇప్పటి వరకు ఓ టీ20 మ్యాచ్‌లో ఛేజింగ్ చేసిన జట్టు ఓడిపోలేదు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 232 పరుగులు చేయగా కరేబియన్లు ఛేజ్ చేసేశారు.

తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ జేపీ డుమిని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగిన రోహిత్ శర్మ (9 బంతుల్లో 21; 2×6, 2×4) భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. అయితే జూనియర్ డాలా వేసిన బౌన్సర్‌కు రోహిత్ అనూహ్య రీతిలో ఔటయ్యాడు. చాలా కాలం తరవాత జట్టులోకి వచ్చిన సురేశ్ రైనా (7 బంతుల్లో 15; 1×6, 2×4) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దూకుడుగా ఆడుతూ జూనియర్ డాలా బౌలింగ్‌లోనే కాట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తరవాత శిఖర్ ధావన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (20 బంతుల్లో 26; 1×6, 2×4)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

కోహ్లీ, ధావన్ కలిసి మూడో వికెట్‌కు 59 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మనీష్ పాండే (27 బంతుల్లో 29 నాటౌట్; 1×6)తోనూ నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని ధావన్ నెలకొల్పాడు. మంచి జోరుమీదున్న ధావన్‌ను ఫెహ్లు్క్యావో ఔట్ చేశాడు. దీంతో 155 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది.

ఇక ఆఖరి ఐదు ఓవర్లలో ఎం.ఎస్.ధోనీ (11 బంతుల్లో 16; 2×4), హార్దిక్ పాండ్యా (7 బంతుల్లో 13 నాటౌట్; 2×4) పాండే 47 పరుగులు రాబట్టారు. దీంతో దక్షిణాఫ్రికా ముందు భారత్ 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -