Thursday, March 28, 2024
- Advertisement -

హీరో నాని కుమారుడు ముద్దొస్తున్నాడు.. హ్యాపీ బ‌ర్త్ డే చెప్పండి

- Advertisement -

వ‌రుస సినిమాల‌తో విజ‌యంతో ఉన్న న‌టుడికి.. నిర్మాత‌గా మారి తొలి సినిమాతోనే విజ‌యం పొందిన వ్య‌క్తి ఎవ‌రంటే న్యాచురల్‌ స్టార్ నాని. అత‌డి అదృష్టం బాగుంది. సినీ రంగంలో దూసుకెళ్తున్న నాని వ్య‌క్తిగ‌త జీవితంలోనూ సంతోషంగా ఉన్నాడు. త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో వ్య‌క్తిగ‌త విశేషాలు పంచుకుంటున్న నాని ఈసారి భిన్న‌మైన పోస్ట్ చేశాడు. ఒక‌రిని ‘నా చిట్టి రాస్కెల్.. దొంగనా కొడుకు.. జున్ను గాడు’ అని తిట్టేశాడు. నాని తిట్టాడా.. ఎవ‌రి మీద‌? ఎందుకు కోప‌మొచ్చింది? అనుకుంటున్నారా అవ‌న్నీ స‌ర‌దాకే!

మార్చి 29 నాని, అంజ‌నాల‌కు ఓ కుమారుడు జ‌న్మించాడు. కుమారుడికి అర్జున్ అని పేరు పెట్టారు. ఈ రోజు గురువారం తొలి పుట్టిన రోజు చేసుకుంటుండ‌డంతో నాని ఈ విష‌యాన్ని ట్వీట‌ర్‌లో పంచుకున్నాడు. ‘నా చిట్టి రాస్కెల్‌ తొలి పుట్టినరోజు ఈ రోజు. దొంగనా కొడుకు. జున్నుగాడు’ అని సరదాగా అంటూ ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫొటోలో నాని త‌న కుమారుడు అర్జున్‌తో ఆటాడుతూ క‌నిపిస్తున్నాడు. వారిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దా స‌న్నివేశం ముద్దొస్తోంది.

2012 అక్టోబర్‌లో నాని, అంజనా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వారికి అర్జున్ జ‌న్మించాడు. ప్ర‌స్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’, నాగార్జున‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -