Wednesday, May 15, 2024
- Advertisement -

కంప్యూటర్లకు వైరస్ ఎక్కిస్తున్న హీరో రామ్!

- Advertisement -

మీరు చదివింది నిజమే.. మన టాలివుడ్ హీరో రామ్  కంప్యూటర్లకి వైరస్ ఎక్కిస్తున్నాడు. అది ఎలా అంటే.. ఏ సినిమా రంగంలో  అయినా చిన్న నిర్మాతలను, పెద్ద నిర్మాతలను, హీరోలను, డైరెక్టర్లను, మొత్తం మీద సినిమా రంగానికి సంబందించిన ప్రతి ఒక్కర్ని వణికిస్తున్నది ఫైరసీ. 

ఈ ఫైరసీ మీద హీరో రామ్ వినూత్న రీతిలో పోరాడి కొంత వరకు సక్సెస్ అయ్యాడు. అది ఏంటంటే తన తాజా సినిమా పండగ చేస్కో ఫైరసీ తనే చేసి ఇంటర్‌నెట్ లో పెట్టాడట. కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి ముఖ్యంగా సినిమాలు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకునే అన్ని వెబ్ సైట్స్ లో అప్‌లోడ్ చేశాడట. అది పండగ చేస్కో మూవీ నే అనుకుని డౌన్‌ లోడ్ చేసిన వారికి డమ్మీ మూవీ ప్లే అవ్వడమే కాక కంప్యూటర్ కి వైరస్ కూడా వస్తుంది.  వైరస్ వస్తోందని చాలా మంది డౌన్ లోడ్ చేసుకోవడం ఆపారని సమాచారం.

మిగతా హీరోలతో పోలిస్తే ఈ విషయంలో హీరో రామ్ కొంత వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తన సినిమాను కొంత వరకైనా కాపాడుకునే ప్రయత్నం చేశాడు.    

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -