ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించునున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు రామ్. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం రామ్ కండలు పెంచే పనిలో ఉన్నాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలను ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసిన వర్మ రామ్ పోతినేని 2.0 లోడింగ్ అంటూ కామెంట్ చేశాడు.
ఈ సినిమాలో రామ్ గ్యాంగ్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ ఛార్మీతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు రామ్.మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్నారు.సినిమాను దసరాకు విడుదుల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
సిక్స్ ప్యాక్‌లో ఎనర్జిటిక్ స్టార్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -