Sunday, April 28, 2024
- Advertisement -

మునుపెన్నడూ లేనంతగా బాలయ్య లైనప్..!

- Advertisement -

దర్శకుల హీరో నందమూరి బాలకృష్ణ. కథ నచ్చితే చాలు చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అని ఆలోచించరు. వెంటనే అవకాశం ఇస్తారు. కొన్నేళ్లుగా ఒక్కో సినిమాని మాత్రమే చేసుకుంటూ వెళుతున్న బాలకృష్ణ మొదటిసారి చాలా సినిమాలు లైనప్ లో పెట్టారు. అది కూడా వరుసగా హిట్లు అందుకున్న అగ్ర దర్శకులతోనే. దీంతో బాలకృష్ణ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ప్రస్తుతం బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బంపర్ హిట్ కావడంతో అఖండ పై భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

Also Read: వరుణ్​తేజ్​ ఔదార్యానికి నెటిజన్లు ఫిదా..!

గోపిచంద్ ఇటీవల రవితేజ తో తీసిన క్రాక్ మూవీ మాస్ హిట్ గా నిలిచింది. దీంతో బాలయ్య గోపీచంద్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అఖండ సినిమా పూర్తవగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. అనిల్ రావిపూడి ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ వెంకటేష్,వరుణ్ తేజ్ తో ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు. ఇది కంప్లీట్ కాగానే బాలకృష్ణతో అనిల్ సినిమా చేయనున్నారు.

ఈ సినిమాలే కాకుండా పైసా వసూల్ సినిమా చేసిన పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేసేందుకు బాలయ్య అంగీకారం తెలిపినట్లు సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని బ్యానర్ లో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు స్వయంగా బాలకృష్ణ ఇటీవల తెలిపారు. అఖండ సినిమా కాకుండా మొత్తంగా నాలుగు సినిమాలు బాలయ్య లైనప్ లో ఉన్నాయి. బాలయ్య జోరు చూస్తుంటే ఈ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also Read: ఆ ఇద్దరు హీరోల రేంజ్ ఎక్కడికో.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -