Monday, April 29, 2024
- Advertisement -

నిజమైన ‘దేవర’ ఎన్టీఆర్.. ఫ్లాప్ డైరెక్టర్ హిట్టు మిషన్ ఆయన.. ఈ క్రేజ్ పీక్స్..!

- Advertisement -

స్టార్ హీరోలకి ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఒకరు కొత్త దర్శకులతో ప్రయోగం చేస్తే కొందరు కేవలం హిట్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తుంటారు. స్టార్ సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ అది తేడా కొడితే హీరో ఇమేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దర్శక నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అయితే టాలీవుడ్ లో ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలని చూస్తారు కానీ ఒకే ఒక్క స్టార్ డైరెక్టర్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తాడు. అతనే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.

ఎన్.టి.ఆర్ సినిమా అంటే బాక్సాఫీస్ సునామి సృష్టించడం ఖాయం. ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసే ఎన్.టి.ఆర్ తన సినిమాలతో ఇండస్ట్రీకి సరికొత్త రికార్డులను పరిచయం చేస్తూ వచ్చాడు. అయితే హిట్ డైరెక్టర్ తో హిట్ కొట్టడం అనేది చాలా కామన్ కానీ ఎన్.టి.ఆర్ మాత్రం ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్స్ తో కూడా హిట్స్ కొడుతుంటాడు. అదేంటి అనుకోవచ్చు.. డైరెక్టర్ ఒక్క ఫ్లాప్ తీశాడంటే ఆ వెంటనే స్టార్ సినిమా ఇవ్వాలంటే ఆలోచిస్తారు కానీ ఆ విషయంలో ఎన్.టి.ఆర్ ఒక అడుగు ముందుకేస్తాడు.

ఎన్.టి.ఆర్ ఇప్పుడే కాదు ఎప్పుడూ డైరెక్టర్ ముందు సినిమా రిజల్ట్ ఏంటన్నది ఆలోచించడు.. బృందావనం సినిమా ముందు వంశీ పైడిపల్లికి మున్నా షాక్ ఇచ్చింది. అయినా కూడా అతనితో బృందావనం చేశాడు తారక్. పూరీ జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు టెంపర్ తో అతనికి బ్రేక్ ఇచ్చాడు. బాబీ కూడా సర్ధార్ గబ్బర్ సింగ్ తో డిజాస్టర్ కొట్టగా నెక్స్ట్ జై లవ కుశతో సూపర్ హిట్ ఇచ్చాడు. సుకుమార్ 1 నేనొక్కడినే తీసి ఫ్లాప్ అందుకోగా అతనితో నాన్నకు ప్రేమతో తీసి హిట్ కొట్టాడు తారక్. ఇప్పుడు అదే దారిలో ఆచార్య తర్వాత కొరటాల శివ తో దేవర సినిమా చేస్తున్నాడు.

డైరెక్టర్ ముందు సినిమా ఫ్లాప్ అయితే స్టార్ హీరోలు అతనితో సినిమా చేయాలంటే వెనకడుగు వేస్తారు. కానీ తారక్ అలా కాదు వారిని ఎంకరేజ్ చేస్తాడు. ఇలా డైరెక్టర్ ఫ్లాప్ తీసిన ప్రతిసారి ఎన్.టి.ఆర్ తో తీసి హిట్ ట్రాక్ ఎక్కారు. అలా చెబితే డైరెక్టర్స్ కి ఎన్.టి.ఆర్ ఒక హిట్టు మిషన్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఫ్లాపుల్లో ఉన్న వారిని హిట్ వైపు నడిపించిన దేవరగా నిలుస్తున్నాడు తారక్. కొరటాల శివ దేవర కూడా హిట్ పడితే ఎన్.టి.ఆర్ పై ఉన్న ఈ సెంటిమెంట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. తప్పకుండా దేవర కూడా బాక్సాఫీస్ దగ్గర తన ప్రతాపం చూపిస్తుందని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -