Thursday, April 25, 2024
- Advertisement -

లుక్ ఒకే రామ్ …మరి సినిమా సంగ‌తి ఏంటీ గురు ?

- Advertisement -

హీరో రామ్ కెరీర్ ఒక హిట్ రెండు ప్లాప్‌లుగా సాగుతుంది.రామ్ కెరీర్‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే హిట్ వ‌చ్చిన వెంట‌నే ప్లాప్‌లు ప‌ల‌క‌రిస్తున్నాయి.దీంతో రామ్‌ను పెద్ద‌గా ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు.ఇటీవ‌ల రామ్ న‌టించిన ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’ సినిమా కూడా యావ‌రేజ్‌గా ఆడింది.సినిమా రోటిన్‌గా ఉండ‌టంతో పాటు,సినిమాలో మ్యాట‌ర్ లేక‌పోవ‌డంతో ‘హలో గురు ప్రేమ’ కోసమే ఫెయిల్ అయింది.ఇక తాజాగా రామ్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకి సంబంధించిన అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ అయితే రాలేదు ,కాని వీరిద్ద‌రు కాండినేష‌న్‌లో మాత్రం సినిమా ఉంటుందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.తాజాగా ఈ సినిమాలో రామ్ కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది.త‌న కొత్త సినిమా లుక్‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు రామ్‌. పూరి జగన్నాథ్ సినిమా కోసమే రామ్ ఇలా కొత్త లుక్ ను సెట్ చేసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇటీవల రామ్ కి పూరి ఒక కథ వినిపించాడనీ, ఆ కథకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -