Monday, May 6, 2024
- Advertisement -

కేసీఆర్ బ‌యోపిక్:ఫ‌స్ట్ లుక్ అదిరింది…!

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు.ఇప్ప‌టికే ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎంలు ఎన్టీఆర్‌,వైఎస్ఆర్ బ‌యోపిక్‌లను సినిమాగా తీస్తున్న సంగ‌తి తెలిసిందే.ఏపీ సీఎం చంద్ర‌బాబు బ‌యోపిక్‌ను కూడా చంద్రోద‌యం పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు.‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న కేసీఆర్ బ‌యోపిక్ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు.

ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిందనీ, ఈ నెల 16న సినిమా పాటలను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమాలో కేసీఆర్ బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన సహా పలు అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు.అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -