Thursday, May 16, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ‘అర‌వింద స‌మేత’ కూడా పాత క‌థే – హీరో రామ్‌

- Advertisement -

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘హలో గురు ప్రేమకోసమే సినిమాతో మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. త్రినాధరావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది.సినిమా విడుద‌ల దగ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్బంగా రామ్ మాట్లాడుతు త‌మ సినిమాను ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేతతో పోల్చుకున్నాడు. ”హలో గురు ప్రేమకోసమే సినిమా కథలో పాయింట్ అందరికీ తెలిసిందే.

ఎక్కడినుండో తీసుకొచ్చిన కాన్సెప్ట్ కాదిది. కానీ తెలిసిన కథనే కొత్తగా చెప్పాం. సినిమాలో గంట పాటు కామెడీ ఉంటుంది.అది కూడా ఇరికించినట్లు కాకుండా కథ ప్రకారమే ఉంటుందని” చెబుతూ తన సినిమాలో కాన్సెప్ట్ పాతదే అయినా టేకింగ్ కొత్తగా ఉంటుందని సమర్ధించుకున్నారు రామ్. దీనికి అరవింద సమేతని ఉదాహరణగా చెబుతూ.. అరవింద సమేతలో కాన్సెప్ట్ కూడా కొత్తది కాదని, టేకింగ్ చాలా కొత్తగా ఉందని అన్నారు.సినిమా ద‌స‌రా కానుక‌గా ఈనెల 18న విడుద‌ల కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -