Tuesday, April 23, 2024
- Advertisement -

నాదీనీది ఒకే క‌థ

- Advertisement -
  • న‌ర్వ‌స్‌గా కనిపిస్తున్న‌ శ్రీవిష్ణు
  • సినిమా మోష‌న్ పిక్చ‌ర్ విడుద‌ల‌

ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టిస్తున్న శ్రీవిష్ణు గ‌త నెల మెంట‌ల్ మ‌దిలో సినిమాతో హిట్ అందుకున్నాడు. ప‌లు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా రాణిస్తూ హీరోగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఆ ప్ర‌య‌త్నాలు విజ‌యాలుగా నిలుస్తున్నాయి. ప్రేమ ఇష్క్ కాద‌ల్‌లో హీరోగా న‌టించిన శ్రీవిష్ణు అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, ప్ర‌తినిధి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీలాంటి పలు సినిమాల్లో శ్రీవిష్ణు న‌టించాడు. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త సినిమాలో న‌టిస్తున్నాడు. న‌ర్వ‌స్‌గా క‌నిపిస్తూ విషాదంలో ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు.

రోహిత్ స‌మ‌ర్ప‌ణ‌లో, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వేణు ఊడుగుల తీస్తున్న సినిమా నాదీనీది ఒకే ఇథ. నిర్మాత‌లుగా ప్ర‌శాంతి, కృష్ణ విజ‌య్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అప్ప‌ట్లో ఒక్క‌డుండేవాడు చిత్ర బృందం ప్ర‌ధానంగా ఈ సినిమాలో ఉండ‌నుంది. ఈ సినిమా మోష‌న్ పిక్చ‌ర్ శుక్ర‌వారం విడుద‌ల‌య్యింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో నీదీ నాది ఒకే క‌థ అంటూ వ‌స్తుంది. ఇక శ్రీవిష్ణు ఎంట్రీ కాగానే మ్యూజిక్ హోరున వ‌స్తుంది. ఆ త‌ర్వాత మంటల్లో కాలిపోతున్న పుస్త‌కాలు క‌నిపిస్తాయి. విజయానికి ఒక మెట్టు.. విజయానికి అర మెట్టు, గెలుపు గుర్రాలు అనే స్ఫూర్తిదాయ‌క పుస్త‌కాలు ద‌హ‌న‌మ‌వుతున్న మోష‌న్ పిక్చ‌ర్ అదిరిపోయింది. దీనితోనే హిట్ కొట్టే మాదిరి అనిపిస్తోంది. ఇక శ్రీవిష్ణు మూడు చిత్రాలు క‌నిపించాయి. ఒక‌టేమో సిగ‌రెట్ తాగుతూ.. రెండోమే గాయాలై క‌ట్ల‌తో బాధ‌గా క‌నిపిస్తూ… మూడు నైరాశ్యంలో ఉన్న మాదిరి ఉన్నాడు. మూడు విభిన్న భావోద్వేగంతో శ్రీవిష్ణు ఉన్నాడు. ఇక సినిమా గురించి ఎలాంటి వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు.

అర‌న్ మీడియా వ‌ర్క్స్ ఆధ్వ‌ర్యంలో మోష‌న్ పిక్చ‌ర్ విడుద‌ల చేసింది. ఈ సినిమాకు సంగీతం సురేశ్ బొబ్బిలి, సినిమాటోగ్ర‌ఫీ రాజుతోట‌, ప‌ర్వేజ్ కె. , ఆర్ట్ టీఎన్ ప్ర‌సాద్‌, ఎడిట‌ర్ బొంత‌ల నాగేశ్వ‌ర్‌రెడ్డి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -