Friday, May 10, 2024
- Advertisement -

అతిలోక‌సుంద‌రిల‌ను త‌యారుచేస్తా

- Advertisement -
  • శ్రీదేవి వీరాభిమాని యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు
  • 2018లో ప్రారంభించే అవ‌కాశం

అభిమానం అనేది ప్ర‌జ‌లు ఒక్కో రూపంలో చూపించుకుంటుంటారు. రాజ‌కీయ నాయ‌కుడికైనా, సినీ ప్ర‌ముఖుడికైనా అభిమానులు కోకొల్ల‌లుగా ఉంటారు. కొంద‌రైతే వీరాభిమానులు ఉంటారు. ఈ అభిమానం పిచ్చి అనేది త‌మిళ‌వాసుల‌కు మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. అందులో హీరో, హీరోయిన్ల‌కు గుళ్లు, గోపురాలు, పాలాభిషేకాలు, ర‌క్త‌త‌ర్ప‌ణాలు త‌దిత‌ర గ‌గుర్పొడిచే కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈ కోవ‌లో ఇంకోటి వ‌చ్చి చేరింది. అయితే ఈ అభిమానం న‌లుగురికి జీవితం ఇచ్చే మాదిరి ఉంది.

అతిలోక సుంద‌రిగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అనాటి స్వారీ స్వారీ ఈనాటి అందాల తార అయిన‌ శ్రీదేవిపై ఓ వ్య‌క్తి వీరాభిమానం చాటుకుంటున్నాడు. తన అందచందాలతో ఆక‌ట్టుకున్న ఆమెకు ఓ వ్య‌క్తి పిచ్చిగా అభిమానిస్తున్నాడు. శ్రీదేవిపై అభిమానంతో ఆమె పేరిట యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేయబోతున్నారు. చెన్నైకి చెందిన అనీశ్‌ నాయర్‌ శ్రీదేవికి వీరాభిమాని. ఆమె కోసం చెన్నైలో యాక్టింగ్‌ ఇనిస్టిట్యూట్‌ని ప్రారంభించాలి అని అనుకుంటున్నట్లు ఇటీవ‌ల మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మ‌రీ తెలిపారు.

శ్రీదేవి నటించిన సినిమాలు, ఆమె నటన, నాట్యానికి సంబంధించిన అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారట. ఈ విషయం తెలిసి శ్రీదేవి కూడా చాలా సంతోషించారట. తన పట్ల ఇంత అభిమానం చూపిస్తున్న అనీశ్‌కి ధన్యవాదాలు చెప్పారట. నటన పట్ల ఆసక్తి ఉన్న పేద పిల్లలకు కూడా ఈ ఇనిస్టిట్యూట్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు అనీశ్ తెలిపారు.

2018లో ఇన్‌స్టిట్యూట్ ప్రారంభానికి శ్రీదేవి వచ్చే వ‌స్తారంట‌. శిక్షణ తరగతుల్లో శ్రీదేవి కూడా కొన్ని పాఠాలు చెప్పే అవకాశం ఉందట. ముంబయి, హైదరాబాద్‌, దిల్లీ, కోల్‌కతాతో పాటు వివిధ దేశాల్లోనూ ఈ ఇన్‌స్టిట్యూట్ శాఖ‌లు విస్త‌రిస్తాన‌ని త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక కూడా చెప్పేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -