Saturday, May 18, 2024
- Advertisement -

భార్యాభ‌ర్త‌లు, పెద్దోడు, కూతురు, ఇప్పుడు చిన్నోడు

- Advertisement -

సీనియ‌ర్ న‌టుడి కుమారుడు ఇంకొక‌రు సినిమాల్లోకి

ఇప్ప‌టికే ఒక కుమారుడు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద కుమారుడిని ప‌రిచ‌యం చేయ‌గా ఇప్పుడు మ‌రో కుమారుడిని రంగంలోకి తీసుకురానున్నారు. మరో వారసుడిని ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేయ‌డానికి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. వాళ్లే.. సీనియర్ హీరో శ్రీకాంత్- ఊహ చిన్న తనయుడు రోహన్. ఇప్ప‌టికే పెద్దోడు రోష‌న్ నిర్మ‌ల కాన్వెంట్ స్కూల్ సినిమాలో న‌టించి మెప్పించాడు. రోష‌న్ త‌మ్ముడు రోహ‌న్ సినిమాలోకి రావడానికి మంచి అవ‌కాశం ల‌భించింది.

కొత్త ద‌ర్శ‌కుడు ఆకాశ్ ద‌ర్శ‌క‌త్వంలో పాష‌న్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తారంట‌. ఈ సినిమాలో ప్రభుదేవా కీలక పాత్ర చేస్తున్నాడు. అతడికి ఈ మూడు భాషల్లోనూ మంచి ఇమేజ్ ఉండటంతో ఈ సినిమాను మూడు భాషల్లోనూ విడుదల చేయడానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఓ కొండ ప్రాంతం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుందని స‌మాచారం. ఇప్పటికే ఊటీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారని తెలుస్తోంది. శ్రీకాంత్-ఊహ దంప‌తులకు మొత్తం ముగ్గురు పిల్ల‌లు. వీరిలో పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే సినిమాలో నటించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలోనూ ఉన్నాడు. దీంతోపాటు నిర్మలా కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించాడు. కుమార్తె మేధ కూడా రుద్రమదేవితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు చిన్నకొడుకు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టడంతో మొత్తం సినిమా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంటోంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -