Sunday, May 5, 2024
- Advertisement -

సర్‌ప్రైజ్…. రాజకీయ నేపథ్యంలో రంగస్థలం… ఆ ఎన్టీఆర్‌గా తారక్

- Advertisement -

రంగస్థలంకి సంబంధించిన ప్రతి విశేషమూ కూడా సుకుమార్ పైన గౌరవం పెంచేలానే ఉంటూ వస్తోంది. సౌండ్ ఇంజినీర్ క్యారెక్టర్‌కి చరణ్‌ని ఒప్పించడం…… సమంతాను గోదావరి జిల్లాల పల్లె పడుచుగా తీర్చిదిద్దడం లాంటివి సినిమా లవర్స్‌ని మెప్పించాయి. అయితే సినిమా అంతా కూడా రొటీన్ రివేంజ్ డ్రామానా అన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా రంగస్థలం యూనిట్ నుంచి వస్తున్న వార్తలు మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేస్తున్నాయి.

రంగస్థలంలో రాజకీయం కూడా ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉంటుందట. అందుకే సీనియర్ ఎన్టీఆర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ని రంగస్థలంలో చూపించనున్నాడట సుక్కు. మణిరత్నం దళపతి స్టైల్‌లో ప్రజెంటేషన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌ది మాత్రం చాలా చిన్న రోల్ అట. కానీ సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని ……. గుర్తుండిపోయే స్థాయిలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్‌లతో రాజమౌళి భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ని తెరకెక్కించనున్న నేపథ్యంలో శాంపిల్‌గా ఈ సినిమాలో చరణ్-ఎన్టీఆర్‌లు కలిసి వెండితెరపై కనిపించనున్నారనుకోవచ్చు. సుకుమార్ మేజిక్ ప్రేక్షకులను మెప్పించాలని మనమూ కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -