Saturday, May 4, 2024
- Advertisement -

రెడ్డి గారి సినిమాలో ఆ హీరో విలన్ గా నటిస్తున్నాడు..!

- Advertisement -

తెలుగు వెటరన్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు.

తొలుత తండ్రి దర్శకత్వంలో నటించడం ద్వారా వెలుగులోకి వచ్చిన వైభవ్ ఆ తర్వాత బయటి బ్యానర్ల సినిమాల్లో కూడా చేయడం మొదలు పెట్టాడు. అయితే సరైన హిట్ లేకపోవడం ఇతడికి మైనస్ పాయింట్ అవుతోంది. తెలుగులో కాదు కానీ తమిళం లో మాత్రం ఇతడి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరో సినిమా ఓకే అయ్యింది.

విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో విలన్ గా కార్తిక్ నటిస్తున్నాడు. కార్తిక్ ను తెలుగువాళ్లకు కూడా కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. 80లలో తమిళంలో స్టార్ హీరో ఇతడు. తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించాడు. అభినందన, అన్వేషణ వంటి సినిమాల్లో కార్తిక్ హీరోగా కనిపిస్తున్నాడు. మరి అలాంటి వెటరన్ యాక్టర్ వైభవ్ సినిమాలో విలన్ గా నటిస్తుండటం విశేషం. ఈ మధ్యకాలంలో కార్తిక్ ఒక తెలుగు సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషించాడు. కల్యాణ్ రామ్ సినిమాలో నటించడం ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. 

కార్తిక్ తో నటించబోతుండటం గురించి వైభవ్ మాట్లాడుతూ. .అలాంటి సీనియర్ యాక్టర్ తోస్క్రీన్ ను షేర్ చేసుకోవడం ఆనందాన్ని ఇస్తోందని చెప్పాడు. మరి ఈ సినిమాతో అయినా వైభవ్ ఒక మాస్ హీరోగా ఎలివేట్ అవుతాడేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -