ఈ మధ్య కాలంలో సౌకర్యం కోసం అని టీ బ్యాగ్ ల వాడకం బాగా ఎక్కువ అయ్యింది. అలాగే గ్రీన్ టీ బ్యాగ్ లు వాడేసిన తర్వాత వాటిని పాడేయ వలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
1. ఎండకు బాగా కమిలిన ముఖానికి,ఒంటి నొప్పులకు ఈ టీ బ్యాగ్ బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని టీ బ్యాగ్ ని వాటిపై ఉంచితే కొంత సేపటికి మంచి ఉపశమనం కలుగుతుంది.
2. దోమ కాటుతో భాదపడుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వీటిని ఉంచితే మంట,నొప్పి తగ్గుముఖం పడతాయి.
3. చర్మం పొడి బారి ఇబ్బందిగా ఉంటే స్నానం చేసే నీటిలో ఈ టీ బ్యాగ్ లను వేస్తే సరి. టీ లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.
4. కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు కళ్లపై గోరువెచ్చని టీ బ్యాగ్ లను పెడితే వేడి పీల్చుకొని ఉపశమనం కలిగిస్తాయి.
5. కంటి చుట్టూ రక్తప్రసరణను పెంచి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు రాకుండా సహాయపడతాయి
