తమిళ స్టార్ హీరో విశాల్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. విశాల్ నటించే ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతోంటుంది. విశాల్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విశాల్ ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన టెంపర్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో విశాల్‌కు గాయం అయినట్లు వార్తలు వస్తున్నాయి.
విశాల్ ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌కు ప్లాన్ చేశాడు. ఈ సాంగ్ కోసం డ్యాన్స్ ప్రాక్టిస్ చేస్తుండగా విశాల్ కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విశాల్ కాలుకు చిన్న గాయం అయినట్లుగా సమాచారం అందుతోంది. డాక్టర్లు రెండు రోజులు విశ్రాంతి తీసుకోమన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో విశాల్‌కు జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
- Advertisement -
షూటింగ్‌లో విశాల్‌కు గాయాలు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -