Saturday, April 27, 2024
- Advertisement -

డూప్ లేకుండ హీరో విశాల్ ఫైట్.. తృటిలో తప్పిన ప్రమాదం

- Advertisement -

ఒకప్పుడు హీల ఫైట్స్ స్టంట్ మాస్టర్స్ డూప్ తో కవర్ చేసేవారు. కానీ ఈ మద్య కొంత మంది హీరోలు డూప్ లేకుండ ఫైట్ సీన్లలో పాల్గొంటున్నారు. కొన్ని సార్లు ప్రమాదాలకు గురి అవుతున్నారు. తాజాగా స్టార్ హీరో విశాల్ ఓ ఫైట్ సన్నివేశంలో డూప్ లేకుండా పాల్గొన్నారు. ఈ క్రమంలో అతనికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతం విశాల్ 31వ చిత్రం షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా సాగుతోంది.

డూప్ లేకుండా ఫైటింగ్ సీన్లో నటిస్తున్న విశాల్ తల వెనుక భాగంలో ఓ సీసా తగిలింది. అయితే ఆయనకు పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. తనకు స్వల్ప గాయం అయినా లెక్కచేయకుండా ఆ ఫైట్ సీక్వెన్స్ ను బ్రేక్ తీసుకోకుండా కొనసాగించడం విశేషం. విశాల్ పాల్గొన్న ఫైట్ దృశ్యాలు సెట్స్ పై ఉన్న మానిటర్ లో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. తాజాగా ఈ విషయం పై విశాల్ స్పందిస్తూ.. ప్రస్తుతం తాను సేఫ్ గానే ఉన్నానని.. చిన్నపాటి గాయం మాత్రం అయ్యిందని అన్నారు.

అయితే ఫైట్ సన్నివేశంలో ఆ ఫైటర్ తప్పేమీలేదని తెలిపారు. కొంచెం టైమింగ్ తప్పిందని, పోరాట సన్నివేశాల చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని పేర్కొన్నారు. నాపై భగవంతుడి దయ ఉందని.. అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని విశాల్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ లు తెరకెక్కిస్తున్నారు. పి. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -