Saturday, April 27, 2024
- Advertisement -

త్రిషకు మద్దతుగా విశాల్..ఎందుకో తెలుసా?

- Advertisement -

త్రిష…వయసు పెరుగుతున్న తరగని అందం ఆమె సొంతం. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం దాటిన ఇప్పటికి అగ్రహీరోల సరసన నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. అయితే ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది త్రిష.

తాజాగా ఓ పొలిటిషన్‌..త్రిషను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇది కోలీవుడ్‌లో దుమారాన్ని రేపగా త్రిష చాలా తీవ్రంగా స్పందించింది. సెలబ్రెటీలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి ఫేమస్ అవ్వాలని చాలామంది చూస్తున్నారని ఫైర్ అవడమే కాదు చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించింది.

ఇక త్రిషకు మద్దతుగా నెటిజన్లతో పాటు హీరో విశాల్ నిలుస్తున్నారు. తాజాగా విశాల్‌ సైతం త్రిషకు అండగా నిలబడ్డాడు. ఓ రాజకీయ పార్టీకి చెందిన మూర్ఖుడు ఒకరు.. మన సినీవర్గానికి చెందిన ఒక వ్యక్తి గురించి అత్యంత దారుణంగా మాట్లాడటం విన్నాను…ఆ వ్యక్తి పేరును ప్రస్తావించను కానీ పబ్లిసిటీ కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. మీరు నరకంలో కుళ్ళిపోతారు… భూమిపై ఉన్నంత వరకు మీరు ఎప్పటికీ మనిషిలా ఉండలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని త్రిషకు క్షమాపణ చెప్పి మనిషిగా మారాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -