Friday, March 29, 2024
- Advertisement -

మాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కలకలం.. దర్శకనిర్మాతలపై నటి రేవతి సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పలువురు నటీమణులు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆడవాళ్లు సినీ ఇండస్ట్రీలోకి రావాలంలో కొంత మంది తమకు పడక సుఖం ఇస్తేనే ఛాన్సులు ఉంటాయని దారుణంగా వాడుకుంటున్నారని బాధిత నటీమణులు ఆరోపిస్తున్నారు. అవకాశాల పేరుతో అమ్మాయిల పడక సుఖం కోరుకునే కామాంధులు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు.

తెరవెనుక బాగోతాలు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉన్నా.. అప్పుడప్పుడూ బయటపడుతుంటాయి. అనేకమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, డాన్సర్లు తమకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పుతున్నారు. తాజాగా మలయాళ నటి, సోషల్ యాక్టివిస్ట్ రేవతి తనకు ఎదురైన లైంగిక వేధింపుల్ని బయటపెట్టింది. తనని శారీరకంగా, మానసికంగా, అసభ్య పదజాలంతో వేధించిన 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్‌ వేదికగా బయటపెట్టింది.

‘ఈ జాబితాలో నన్ను లైంగికంగా, మానసికంగా.. మాటలతో వేధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను ’అని తెలిపారు.

రేవతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పేర్లు :
1) రాజేష్ టచ్‌రైవర్ (డైరెక్టర్)
2) సిద్దిక్ (నటుడు)
3) ఆశిక్ మాహి (ఫోటోగ్రాఫర్)
4) షిజు (నటుడు)
5) అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు)
6) అజయ్ ప్రభాకర్ (డాక్టర్)
7) ఎంఎస్ పధుష్ (దుర్వినియోగదారుడు)
8) సౌరభ్ కృష్ణన్ (సైబర్ బల్లీ)
9) నందు అశోకన్ (డివైఎఫ్ఐ యూనిట్ కమిటీ సభ్యుడు, నేదుంకర్)
10) మాక్స్వెల్ జోస్ (షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడు)
11) షానూబ్ కరవత్ (యాడ్ డైరెక్టర్)
12) రాగేంద్ పై (కాస్ట్ మి పర్ఫెక్ట్, క్యాస్టింగ్ డైరెక్టర్)
13) సారున్ లియో (ఈఎస్ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్, వాలియతురా)
14) బిను (సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పూంతురా పోలీస్ స్టేషన్, తిరువనంతపురం)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -