కీర్తి సురేష్ తెలుగు , తమిళ భాషలలో సినిమాలు చేస్తు స్టార్ హీరోయిన్‌గా మారింది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహనటి సినిమాలో సావిత్రిగా మెప్పించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఈ సినిమా తరువాత తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు ఈ భామ. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. విక్రమ్, విజయ్,విశాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. తాజాగా కీర్తి తెలుగులో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. ఈ సినిమాకు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన మొదలు కానుంది. ఈ సినిమా కేరళలోనే ఎక్కువ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అయితే ఈ సినిమా కోసం కీర్తి , సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమాను సైతం వదులుకుందని తెలుస్తోంది.రజినీకాంత్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట కీర్తి సురేష్‌ను సంప్రదించారట. అయితే అప్పటికే తెలుగు సినిమాకు డేట్స్ ఇచ్చేసింది కీర్తి. దీంతో చేసేది లేక రజినీకాంత్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది కీర్తి. ఈ విషయం తెలుసుకున్న కీర్తి సురేశ్ అభిమానులు ఎంత పని చూశావ్ కీర్తి అంటు తెగ భాదపడిపోతున్నారు.
- ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
- కోమటిరెడ్డి..భోళా మనిషి!
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’