Tuesday, April 30, 2024
- Advertisement -

రజనీ..లాల్ సలామ్‌పై క్లారిటీ మిస్!

- Advertisement -

స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.తొలుత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుందని వార్తలు వచ్చాయి. అంతేగాదు మార్చి 8న రిలీజ్ కానుందని ప్రచారం జరిగింది…అయితే తీరా స్ట్రీమింగ్ కాలేదు.

తర్వాత మార్చి 21 అని ప్రచారం జరిగినా అది ఫేక్ అనే తేలిపోయింది. తాజాగా ఈసారి లాల్ సలామ్ ఓటీటీ ఫ్లాట్ ఫామే మారిపోయిందని సమాచారం. సన్ నెక్స్ట్ లో త్వరలోనే లాల్ సలామ్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోండగా దీనిపై అఫిషియల్‌ ప్రకటన రావాల్సి ఉంది.

విష్ణు విశాల్, విక్రాంత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా రజనీ కూతరు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించినా డిజాస్టర్‌గా మిగిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -