- Advertisement -

శ్రీరెడ్డి లాగా నేను విప్పాలా?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి ఇప్పుడు పోరాటం చేసిందేమో కాని అస‌లు పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి గళమెత్తిన నటి మాధవీ లత.హీరోయిన్ మాధవీ లత ఎప్ప‌డు నుండో త‌న‌కు ఇండ‌స్ట్రీ లో జ‌రిగిన అన్యాయంపై మీడియా వేదిక‌గా చాలాసార్లు త‌న ఆవేద‌న‌ను చెప్పింది.ఇప్పుడు శ్రీరెడ్డి చేసిన ప‌నిని త‌న‌ను కూడా అలానే చేయ‌మ‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడుతున్నారని మాధవీ లత చెప్పుకొచ్చింది.శుక్రవారం తన ఫేస్‌బుక్ ఫాలోవర్లపై లైవ్లో మండిపడింది.

ముఖ్యంగా తనపై వ్యతిరేకంగా, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ఫాలోవర్లపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఫేస్‌బుక్ ఓపెన్ చేయాలంటే భయమేస్తోంది. అంతా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు’’ అంటూ భావోద్వేగానికి గురైంది. ‘‘నాకు ఫ్యామిలీ ఉంది. ఆమెలా నేను చేయలేను’’ అని చెబితే.. ‘‘ఆ అమ్మాయికి ఫ్యామిలీ లేదా? ఆమె పోరాడటం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారు? నేను కూడా ఆమెలా బట్టలు విప్పాలని అనుకుంటున్నారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -