సినిమా ప్రపంచంలో లైంగిక వేధింపులు ఉంటాయని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చాలా ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. “మీటు, క్యాస్టింగ్ కౌచ్” లాంటి ఉద్యోమాల ప్రభావంతో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బయటపడుతున్నాయి. వెండితెర, బుల్లితెర, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అంతటా లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మల్హార్ రాథోడ్ నోరువిప్పి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి షాక్ ఇచ్చింది. దాదాపు 8 ఏళ్ళ క్రితం ఓ నిర్మాత తనని రుంకి పిలిచి డ్రెస్ విప్పమని అడగాడని తెలిపింది. సీరియల్‌లో అవకాశం ఇస్తానని చెప్పి ఆడిషన్స్‌కి పిలిచి ‘ఆ టాప్ తీసేయ్.. నేను చూడాలి’ అంటూ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. పైగా ఆ నిర్మాత వయసు 65 సంవత్సరాలు ఉంటుందని హీరోయిన్ మల్హార్ రాథోడ్ తెలిపింది.
ఆ నిర్మాత అలా అడగడంతో ఏం చెయ్యాలో కూడా తనకు అర్థం కాలేదని, మెల్లగా అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిపింది. ఇది జరిగిన తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలా మంది కామాంధులు ఉన్నారని తనకు అర్దం అయినట్లు చెప్పింది. కుటుంబ పోషణలో తన సంపాదనే కీలకం అని చెప్పిన ఆమె.. ఇలా అవకాశాల కోసం నిర్మాతల పక్కలెక్కే టైపు కాదని తెలిపింది. అవకాశం వస్తుంది కదా అని ఏ రోజూ ఇలాంటి పనులు చేయలేదని అంటూ.. ఈ ఫీల్డ్ కాకపోతే మరో ఫీల్డ్ అయినా ఎంచుకొని కెరీర్ కొనసాగిస్తానని మల్హార్ రాథోడ్ చెప్పుకొచ్చింది.
