- Advertisement -

ఉదయ్ కిరణ్ భార్య నిజంగా అలా చేసిందా ?

- Advertisement -

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని ఆరేళ్లు అయినా ఇప్పటికి అతని గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఉదయ్ కిరణ్ మరణానికి ఆర్థిక కారణాలే అని ఇన్నేళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతడి అక్క శ్రీదేవి సంచలన వ్యాఖ్యలతో ఉదయ్ మరణం వెనక మిస్టరీ ఉందన్న అనుమానాలు వస్తున్నాయి.

కుటుంబ కలహాలతోనే ఉదయ్ ఆత్మహత్య చేసుకున్నాడని అర్థం వచ్చేలా ఉదయ్ అక్క శ్రీదేవి మాట్లాడింది. తన తమ్ముడు కోటీశ్వరుడు అని.. వాడికి డబ్బుల్లేక చచ్చిపోవాల్సిన ఖర్మ పట్టలేదని చెప్పింది. భార్య విషితపైనే తమకు అనుమానాలున్నాయని అమె మాట్లాడింది. బంగారం, డబ్బులతో పాటు ఉదయ్ పేరు మీదున్న స్థిరాస్తులు కూడా భార్య విషిత తీసుకుందని.. కనీసం మాట్లాడటానికి కూడా ఇప్పుడు అవకాశమివ్వడం లేదని శ్రీదేవి కామెంట్స్ చేసింది. అసలు ఉదయ్ చచ్చిపోయిన తర్వాత ఆమె కనిపించడం లేదు. మీడియాకు కూడా ఆమె దూరంగా ఉంటుంది.

ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి.. 11 రోజులు పూర్తైపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్న సందర్భాలు లేవట. అయితే విషిత ఇప్పుడు బయటికి రాకపోతే ఉదయ్ కిరణ్ అక్క చెప్పిందే నిజమవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను విషిత లైట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె బయటికి వచ్చి స్పందించడం కూడా అనవసరం అని ఫీల్ అవుతున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -