Saturday, April 27, 2024
- Advertisement -

శ్రియ‌ను ఆ ప‌నికి ఒప్పుకోమ‌ని అడిగార‌ట‌..!

- Advertisement -

హీరోయిన్ శ్రియ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి దాదాపు 15 ఏళ్లు కావస్తున్న ఇప్ప‌టికి వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. శ్రియ‌తో పాటు హీరోయిన్లు ఎప్పుడో ఫెడ్ అవుట్ అయ్యారు. శ్రియ మాత్రం హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది. ఇక ఆమె పోయిన ఏడాదే పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌రువాత కూడా సినిమాల‌లో న‌టిస్తుంది శ్రియ‌. తాజాగా శ్రియ త‌న ఎదురైన ఓ సంఘ‌ట‌న‌ను బ‌య‌ట‌పెట్టింది. సాధార‌ణంగా హీరోయిన్లు ప‌లు సంస్థ‌ల‌కు, బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హారిస్తుంటారు.

శ్రియ కూడా అప్ప‌ట్లో కొన్ని యాడ్స్‌లో క‌నిపించింది కూడా. తాజాగా త‌న ద‌గ్గ‌ర వ‌చ్చిన కమర్షియల్ యాడ్స్‌పై చాలా కండీషన్స్ పెడుతుందట‌. త‌న ద‌గ్గ‌రకు వ‌చ్చిన ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌ను రిజెక్ట్ చేసింద‌ట ఈ భామ‌.ఫెయిర్‌నెస్‌ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారనీ, త్వరగా పెళ్ళవుతుందన్న ప్రకటన ఒకటి ఆ మధ్య బాగా వచ్చింది. ఆ ప్రకటన ముందు వచ్చింది నా దగ్గరికే. కాని నేను చేయనంటూ రిజక్ట్‌ చేశానని చెప్పుకొచ్చింది శ్రియ‌. . ఆ క్రీమ్ వాడితేనే పెళ్ళవుతుందా? లేకపోతే లేదా? తెల్లగా ఉండడం అన్నది చర్మ సౌందర్యానికి సంబంధించినది.అంతే కాని క్రీములు వాడితే రాద‌ని తెలిపింది. ఈ యాడ్ ఒప్పుకోమ‌ని, బాగానే డ‌బ్బులు ఆఫ‌ర్ చేశార‌ట స‌ద‌రు సంస్థ. మీరు ఎంత డ‌బ్బు ఇచ్చిన ఇలాంటి యాడ్ చేయ‌న‌ని ఖర‌ఖండిగా చెప్పింద‌ట శ్రియ‌.

ఇలాంటి అబద్దాలను ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే కొన్ని యాడ్స్ కు ఎంత డబ్బు ఇస్తామన్నా ఒప్పుకోను తెలిపింది. దీనిపై నెటిజ‌న్లు శ్రియ‌ను ర‌కార‌క‌లుగా ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో మీరు ఇలాంటి యాడ్స్ చేశారు. అప్పుడు ఏమైయ్యాయి మీ మాట‌లు అని ప్ర‌శ్నిస్తున్నారు. మీరు ఎటుంవ‌టి క్రీము వాడ‌కుండానే ఇంత తెల్ల‌గా పుట్టారా ? అని శ్రియ‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -