Tuesday, April 30, 2024
- Advertisement -

ఘాటు రొమాన్స్‌తో రెచ్చిపోయిన యాంక‌ర్ ప్ర‌దీప్ ల‌వ‌ర్‌

- Advertisement -

యాంక‌ర్ ప్ర‌దీప్ ల‌వ‌ర్ అంటే నిజ జీవితంలో ల‌వ‌ర్ కాదండీ .. యాంక‌ర్ ప్ర‌దీప్ ఆ మ‌ధ్య పెళ్లి చూపులు పేరుతో ఓ షో నిర్వ‌హించారు. ఈ షో అప్ప‌ట్లో చాలానే విమ‌ర్శ‌ల‌ను ఫేస్ చేసింది. ఈ షోకి యాంక‌ర్‌గా సుమ వ్య‌వ‌హారించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. దాదాపు 14 మంది అమ్మాయిలు వ‌చ్చారు వారిలో విన్న‌ర్‌గా నిలిచింది జ్ఞానేశ్వరి కందిరేగు. ఈ షో ద్వారా బాగానే పాపుల‌ర్ అయింది. ఈ షోలో విన్నర్‌గా నిలిచిన త‌రువాత అంద‌రు ప్ర‌దీప్ ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటార‌ని అనుకున్నారు.

కాని జ‌స్ట్ షో మాత్ర‌మే అని అంద‌రికి షాకిచ్చాడు ప్ర‌దీప్‌. దీనిపై జ్ఞానేశ్వరి కూడా ప్ర‌దీప్ పెళ్లి విష‌యంలో మోసం చేశాడ‌ని కామెంట్స్ కూడా చేసింది. ఈ షో విన్న‌ర్‌గా నిలిచిన త‌రువాత జ్ఞానేశ్వరి ప‌లు షార్ట్‌ఫిల్మ్‌ల్లో న‌టించింది. త‌ద్వారా జ్ఞానేశ్వరికి సినిమాల‌లో న‌టించే అవ‌కాశం కూడా ల‌భించింది.ప్రస్తుతం ఈ భామ ‘మిస్టర్ అండ్ మిస్’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. టీజ‌ర్ మొత్తం బోల్డ్ స‌న్నివేశాల‌తో నింపేశాడు ద‌ర్శ‌కుడు. ఇక హీరోయిన్‌గా న‌టించిన జ్ఞానేశ్వరి కూడా ఘాటు రొమాన్స్‌తో రెచ్చిపోయింది. లిప్ లాక్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది జ్ఞానేశ్వరి.సెల్ఫీ వీడియోలతో తమ జీవితంలోని ప్రతి మూమెంట్ ని క్యాప్చర్ చేసుకొనే అలవాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు.

వాటి నుండి ఎలా బయటపడతారనే పాయింట్ తో ఈ సినిమాను రూపొందించిన‌ట్లు చిత్ర ద‌ర్శ‌కుడు అశోక్ రెడ్డి తెలిపారు. టీజ‌ర్‌లోనే ఇంత ర‌చ్చ ఉంటే , ఇక సినిమాలో ఎంత ర‌చ్చ చేసి ఉంటారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజిన్లు. పెళ్లి చూపులు ప్రొగ్రామ్‌లో ఎంతో ప‌ద్ద‌తిగా క‌నిపించిన జ్ఞానేశ్వరి ..ఈ సినిమాలో హాట్‌గా క‌నిపించి అంద‌రికి షాకిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -