Saturday, April 27, 2024
- Advertisement -

ఓటీటీలో హాయ్ నాన్న..అదుర్స్!

- Advertisement -

శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన 2023 డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురాగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

ఈ చిత్రం లాంగ్ రన్‌లో లాంగ్ రన్ లో రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టింది. తాజాగా ఓటీటీలోనూ సత్తాచాటుతోంది హాయ్ నాన్న. న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 4 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోండగా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.

ఈ చిత్రం ప్రస్తుతం టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. హిందీ వెర్షన్ లో టాప్ 5లో, తమిళ వెర్షన్ లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతుండటం వివేషం. కుటుంబ సమేతంగా చూడగలిగిన చిత్రం కావడంతో మంచి స్పందన వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -