Sunday, May 19, 2024
- Advertisement -

15 నిమిషాలు మూడు రోజుల్లో, శ్రీను వైట్ల ఇదెలా సాధ్యం ?

- Advertisement -

బ్రూస్లీ సినిమా షూటింగ్ లో అనుకున్న ఘట్టం వచ్చేస్తోంది, “మెగా మీటర్” సాంగ్ షూటింగ్ మొదలు కావడం తో 28 నుంచీ చిరంజీవి ఈ షూటింగ్ లో పాల్గొంటారు అని శ్రీను వైట్ల చెప్పకనే చెప్పారు. 

ఈ సినిమా కి చిరంజీవి కేవలం మూడు రోజుల డేట్ లు ఇవ్వడం తో అవతల సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతూ ఉండడం తో ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చెయ్యాలనే ఆలోచన లో శ్రీను ఫాస్ట్ గా కానిచ్చేస్తున్నాడు. శ్రీను వైట్ల స్పీడ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఎందుకు మాట్లాడుకోవాలంటే.. బ్రూస్ లీలో చిరంజీవి 15 నిమిషాల పాటు కనిపిస్తారన్న మాట వాస్తవమే. 

ఇందులో ఒక పాట ఒక ఫైట్ కొన్ని సన్నివేశాలు ఉంటాయని వైట్ల ఓపెన్ గానే చెప్పాడు. మరిప్పుడు చిరు డేట్స్ ప్రకారం వీటన్నిటినీ 3 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి. ఒక పాట తీయడం కోసం పది పదిహేను రోజులు సమయం అవసరం అవుతుంది, ఫైట్ కి కనీసం ఒక వారం అనుకుంటే మరి చిరంజీవి – చరణ్ లను ఒకే సారి తెర మీద చూపిస్తూ అంత త్వరగా ఎలా లాగించేస్తారు అనేది పెద్ద వింత అనిపిస్తోంది.

 15 నిమిషాల ఎపిసోడ్ ని మూడు రోజుల్లో పూర్తి చేసేస్తే మరి క్వాలిటీ సంగతేంటి అని భయపడుతున్నారు మెగా ఫాన్స్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -