Friday, May 10, 2024
- Advertisement -

మెగా హీరో సినిమా లో నందమూరి హవా !

- Advertisement -

మొన్న విడుదల అయిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చాలా రొటీన్ గా ఉన్నా హరీష్ శంకర్ రాసిన డయలాగులు బాగా పేలాయి అంటున్నారు.

చాలా సన్నివేశాల్లో సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ అతడి మేనమామలు చిరంజీవి – పవన్ ని పోలి ఉందన్న సంగతి పసిగట్టేశారంతా. 

చిరంజీవి – పవన్ సినిమాల ప్రస్తావన తేవడం లో హరీష్ శంకర్ ఆదరకోట్టేసాడు అని చెప్పాలి. ముఠా మేస్త్రి సినిమా లో చిరంజీవి మార్క్ స్టెప్ వేసి తిరుగు లేదు అనిపించాడు మనోడు. ఇలా మెగా హీరోలు మెగా హీరోలని ఇమిటేట్ చేసుకుంటే ఓకే కానీ నందమూరి హీరోల మీద కూడా పడ్డాడు హరీష్. సినిమా లో అక్కడక్కడా  ఎన్టీఆర్ బృందావనం – బాద్ షా – టెంపర్ సినిమాల ప్రస్థావన తెచ్చాడు . 

”ఆది తాళం.. సింహాద్రి రాగం.. టెంపర్ యోగం” అంటూ ఒక డైలాగ్.. ”నేనేమీ మీతో బ్రాందీ తాగించి నేను మజ్జిక తాగి.. ఇక్కడ బృందావనం చేయడానికి రాలేదు” అంటూ మరో డైలాగ్. ఇలా చాలా వాడాడు తరవాత తాగుబోతు రమేష్ తో “దాసు గాడి దండ యాత్ర ” అంటూ డయలాగ్ చెప్పించాడు. 

రామయ్య వస్తావయ్య తరవాత ఎన్టీఆర్ కీ హరీష్ కీ పడట్లేదు అంటున్నారు సో ఆ కోపం లో అలా చెప్పించాడా లేక మరేమైనా కారణం ఉందా అంటున్నారు ప్రేక్షకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -