ప్రస్తుతం తెలుగులో.. వెన్నెల కిషోర్ టైమ్ నడుస్తోంది. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో కిషోర్ కనిపిస్తున్నాడు. అయితే వెన్నల కిషోర్.. స్పూఫ్‌లు, ప్యారడీలు కాకుండా.. డిఫరెంట్ గా ఒరిజినల్ కామెడీతో నవ్విస్తున్నాడు.
{loadmodule mod_custom,GA1}
బ్రహ్మానందంకు చాన్సులు రావడం తగ్గాక.. సునీల్ కామెడీ రోల్స్ నుంచి హీరో అయిపోయాక.. మంచి కామెడీ చేసే యాక్టర్ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. అయితే యాక్టర్ పృధ్వీ కొన్ని చిత్రాల్లో.. పర్వాలేదు అనిపించినప్పటికి.. మూస ధోరణి వల్ల స్టార్ కమెడియన్ కాలేకపోయాడు. సరిగ్గా ఈ సమయంలో వరసపెట్టి చాలా సినిమాల్లో తన కామెడీతో వెన్నెల కిషోర్ హైలైట్ అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో అతనికి డిమాండ్ బాగా పెరగడంతో కిషోర్ కాల్షీట్ రేటు అమాంతం అయిందంతలు అయిందట. ఏడాది క్రితం వరకు అతని సింగిల్ డే కాల్షీట్ యాబై వేలు పలికేదట.
{loadmodule mod_custom,GA2}
కానీ ఇప్పుడు అతనికి రోజుకి రెండున్నర లక్షలు చెల్లిస్తున్నారని, పెద్ద హీరోల సినిమాలకైతే రోజుకి లక్షన్నర, రెండు లక్షలకి చేస్తున్నా కానీ చిన్న చిత్రాలకి మాత్రం రెండున్నర లక్షలు అడుగుతున్నాడని, రారండోయ్ వేడుక చూద్దాం, అమీ తుమీ తర్వాత అతనికి మరింత డిమాండ్ పెరిగింది కనుక ఇక మీదట అతని రేటు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
{youtube}niGtxes8foY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related