అవును మీరు చదువుతుంది నిజమే.. ఈమెకు రోజు జీతం జీతం2.18 లక్షలు.. అంటే గంటకు 26000.. అయితే ఇంతకీ ఎవరు.. ఈమే.. ఏం చేస్తోంది.. ఇంత డబ్బు ఎలా సంపాధిస్తుంది అనే విషయాలు తెలుకోవాలంటే.. అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ఈమె పేరు చందాకొచ్చర్.. అతిపెద్ద ప్రైవేటు రంగ విత్త సంస్థ అయిన ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ.
ఐసిఐసిఐ రిలీజ్ చేసిన వార్షిక నివేదిక.. ఈ విషయంను తెలిపింది. గత (2016-17) ఆర్థిక సంవత్సరంలో ఆమెకు రూ.7.85కోట్ల వేతనం చెల్లించినట్లు ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఆమె జీతం 64శాతం మేర పెరిగిందని.. మూల వేతనం 15శాతం పెరిగి రూ.2.67 కోట్లకు చేరినట్లు నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా పని తీరు సంబంధించిన బోనస్ కింద.. రూ.2.2 కోట్లు ఈమెకు చెల్లించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో అప్పుడు ఇవ్వాల్సిన బోనస్ ను 2016-17లో చెల్లించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
కొచ్చర్ జీతభత్యాల పేరుతో రూ.32 లక్షలను, గ్రాట్యుటీ కింద రూ.22 లక్షలను ఆర్జించారు. ఇందులో రూ.13.75 లక్షల ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లను కలుపలేదు. భారీ జీతంతో పాటు కొచ్చర్ కు విద్యుత్తు, ఫోన్, గ్యాస్, నీరు, విలాసవంతమైన కారు, క్లబ్ చార్జీలను కూడా బ్యాంకే బరిస్తోంది. దీనికి తోడు గ్రూపు ఇన్సురెన్స్ ఎల్‍టీఏ, పీఎఫ్ లు అదనం.
{youtube}B7CP01LXKf0{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
