Monday, June 17, 2024
- Advertisement -

2018 అత్యంత చెత్త సినిమాలు లిస్ట్ ఇదే..!

- Advertisement -

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు 2018లో మంచి ఫ‌లితాల‌తో పాటు, చెడు ఫ‌లితాలను కూడా చ‌విచూసింది. 2018 సంవ‌త్స‌రం దాదాపు ముగిసిపోయిన‌ట్లే. ఏడాది చివ‌ర‌కు చేర‌డంతో విడుద‌ల కావాల్సిన సినిమాలు కూడా పెద్ద‌గా ఏం లేక‌పోవ‌డంతో ఈ సంవ‌త్స‌రం ప్లాప్ సినిమాల రివ్యూను ఓ సారి చూద్దాం.

ఈ సంవ‌త్స‌రం అతి పెద్ద ప్లాప్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా నిలిచింది. ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం, రెగ్యులర్ ఫార్మాట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిసి సినిమాని డిజాస్టర్ చేశాయి. ర‌వితేజ న‌టించిన ట‌చ్ చేసి చూడు సినిమా కూడా ఘోరంగా ప్లాప్ అయింది. వివి వినాయిక్ – సాయి ధ‌ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘ఇంటెలిజెంట్ సినిమా కూడా ప్లాప్‌ను మూట‌గ‌ట్టుకుంది.

ఇక నితిన్ న‌టించిన ఛ‌ల్ మోహ‌న్ రంగ సినిమా కూడా ప్లాప్‌ల లిస్ట్‌లోకి చేరిపోయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ సినిమాను కాప‌డ‌లేక‌పోయాడు. వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్టిన నానికి షాక్ ఇచ్చింది ‘కృష్ణార్జున యుద్ధం. డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన‌ప్ప‌టికి ఈ సినిమాను కాపాడలేక‌పోయాడు నాని. ఇక ఇండ‌స్ట్రీకి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్‌. బ‌న్నీ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్లాప్ అయింది. ఈ సినిమాపై బ‌న్ని చాలానే ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ సినిమా దెబ్బ నుంచి ఇప్ప‌టి వ‌రకు బ‌న్ని కోలుకోలేదు.

నితిన్ ఈ సంవ‌త్స‌రం రెండు ప్లాప్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ న‌టించిన శ్రీనివాస క‌ల్యాణం కూడా ప్లాప్‌ల జాబితాలో చేరింది. టాలీవుడ్ సన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. గీతా గోవిందం వంటి హిట్ త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా సినిమాను ప్రేక్ష‌కులు తిర‌స్కరించారు.

మంచు విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ ‘కవచం’, సాయి ధరమ్‌ తేజ్ ‘తేజ్ ఐ లవ్యూ’, రవితేజ ‘అమర్ అక్బర్ అంటోనీ’,నాగచైతన్య ‘సవ్యసాచి’, , కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’, సందీప్ కిషన్ ‘నెక్స్ట్ ఏంటి..?’ సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. అయితే ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం ఏమిటంటే .టాలీవుడ్ టాప్ హీరోలైన ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్, మ‌హేశ్ బాబులు త‌మ కెరీర్ బెస్ట్ సినిమాలు కూడా ఈ సంవ‌త్స‌ర‌మే రావ‌డం గ‌మ‌న‌ర్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -