Wednesday, May 15, 2024
- Advertisement -

బాలయ్య కోసం భారీ సెట్

- Advertisement -

నందమూరి బాలకృష్ణ శ‌త చిత్రం స‌క‌ల హంగుల‌తో రాబోతోంది. దానికి త‌గ్గ‌ట్టుగా బాల‌య్య చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. స‌హ‌జంగానే చారిత్ర‌క పాత్ర‌ల‌కు స‌రిగ్గా స‌రిపోయే ఆయ‌న రూపంలో కూడా కొన్ని మార్పులు చేస్తున్న‌ట్టు స‌మాచారం. దానికి త‌గ్గ‌ట్టుగానే సినిమా చిత్రీక‌ర‌ణ‌లో కూడా భారీత‌నం చూప‌బోతున్నారు.

ఇప్ప‌టికే దానికి త‌గ్గ‌ట్టుగా సెట్స్ విష‌యం అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా బాల‌య్య న‌టిస్తున్న‌ గౌతమిపుత్ర శాతకర్ణి అన్ని సిద్ధం చేసుకుని మొరోకో లొకేషన్స్ లో కొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఈ మూవీ మూడు వారాలు అక్కడ షూటింగ్ జరుపుకుని తిరిగి హైదరాబాద్ లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది.

ఈ షూట్ కి సంబంధించి హైదరబాద్ బయట భారీ సెట్ వేసారు.క్రిష్ అండ్ టీం చాలా శ్ర‌ద్ధ‌గా ఈ సెట్ రూపొందిస్తున్నారు. స‌మ‌యాన్ని దృష్టిలో పెట్టుకుని స‌కాలంలో పూర్తి చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ సెట్ ని టైం కి సిద్ధం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా విరామం లేకుండా కృషి చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ మ్యూజిక్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతి కి థియేటర్స్ కి రానున్నది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -