Thursday, May 8, 2025
- Advertisement -

గోట్ కోసం ఇన్ని కోట్లా?

- Advertisement -

వెంకట్ ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం The GOAT(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). AGS ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో GOATని రిలీజ్ చేయనుంది మైత్రీ మూవీస్.

ఇందుకోసం ఏకంగా రూ.25 కోట్లు వెచ్చిందంట. విజయ్ సినిమాకు ఇంత పెద్ద మొత్తంలో మైత్రీ మూవీస్‌ వెచ్చించడం విశేషం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -