ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ …. పవన్ కళ్యాణ్‌ను స్టైలిష్ మరియు స్వాగ్ ఉన్న పాత్రలో చూపించనున్నారని అభిమానులు భావిస్తున్నారు.
ఈ చిత్రానికి ఉత్తర అమెరికాలో ప్రీమియర్ షోల ప్రీ-సేల్స్ ఇప్పటికే మంచి స్పందనను అందుకుంటున్నాయి. ఇప్పటివరకు దాదాపు 5,000 ప్రీమియర్ టికెట్లు అమ్ముడవగా, మొత్తం కలెక్షన్లు $115K (సుమారు రూ.95 లక్షలు) దాటాయి. పూర్తి స్థాయి బుకింగ్స్ ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ భారీ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తుండగా విలన్ పాత్రలో పార్తీబన్ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోండగా సంగీతాన్ని దేవీ శ్రీ ప్రసాద్, తమన్ అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
