- Advertisement -

ఓటీటీలోకి మేడ్ ఇన్ కొరియా!

- Advertisement -

ఇటీవల ఓజీ సినిమాతో మెప్పించిన నటి ప్రియాంక అరూల్ మోహన్. తాజాగా ఆమె నటించిన కొత్త చిత్రం మేడ్ ఇన్ కొరియా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ చిత్రం ద్వారా ప్రియాంకా అరుల్ మోహన్ డిజిటల్ (ఓటీటీ) ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. సినిమా ప్రమోషన్లు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు పెద్దగా పాజిటివ్ బజ్ రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంకా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఓటీటీ రంగంలో అవకాశాలు వెతుకుతున్న ఆమెకు ఈ సినిమా చాలా కీలకంగా భావిస్తున్నారు.

పూర్తిగా కొరియాలో షూటింగ్ చేసిన తొలి ఇండో-కొరియన్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను పేర్కొంటున్నారు. తమిళనాడుకు చెందిన ఓ యువతి మంచి జీవితాన్ని ఆశిస్తూ దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి వెళ్లే కథ చుట్టూ సినిమా సాగుతుంది. ఇది సంస్కృతుల మధ్య ఎదుగుదలను చూపించే ‘కమింగ్ ఆఫ్ ఏజ్’ డ్రామాగా తెరకెక్కింది. ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్.

ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనిధి సాగర్ నిర్మించగా తమిళంతో పాటు ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -