Monday, May 6, 2024
- Advertisement -

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో బాల‌య్య ఎంట్రీకి అరుపులే అరుపులు..!

- Advertisement -

రామ్ గోపాల్ వ‌ర్మ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. ఏపీ మాజీ ముఖ్యమంత్రి , న‌టుడు ఎన్టీఆర్ జీవితంలోని చివ‌రి సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు వ‌ర్మ‌. నిన్ననే(శుక్ర‌వారం) ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కొన్ని వివాద‌ల కార‌ణంగా ఈ సినిమా ఆంధ్ర‌లో విడుద‌ల కాలేదు. ఇక తెలంగాణ‌లో విడుద‌ల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండ‌గా సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అవ్వ‌గానే థియోట‌ర్ మొత్తం ఈల‌లు, అరుపుల‌తో తెగ గోల చేశార‌ట అభిమానులు. బాలకృష్ణ పాత్రకు ఇచ్చిన సన్నివేశాలు తక్కువే అయినా థియేటర్లలో ఈలలు గోలతో కాసేపు మోత మోగడం విశేషం.

బాల‌కృష్ణ కూడా త‌న తండ్రి జీవితాన్ని కథానాయకుడు, మహానాయకుడు అని రెండు పార్టులుగా విభ‌జించి సినిమా తీశాడు. ఆ సినిమాలో బాల‌య్యా ఇంత‌టి రెస్ప‌న్స్ రాలేదట‌. కాని ల‌క్షీస్ ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య పాత్రకు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ట‌. చంద్రబాబు నాయుడు పాత్ర ఏం చేసినా దానికి మద్దతు ఇవ్వడం తప్ప అంతకు మించి సినిమాలో బాల‌య్య క్యారెక్ట‌ర్ ఏమి లేదు. ఇక ఈ సినిమాలో బాల‌య్య పాత్ర‌దారిని అచ్చం ఆయ‌నకు మాదిరిగానే ఉన్న వ్య‌క్తిని పెట్ట‌డంతో వ‌ర్మ విజ‌యం సాధించాడు. సినిమా టైటిల్స్ ప‌డే స‌మ‌యంలో కూడా బాల‌య్య‌పై త‌న‌కున్న ప్రేమ‌ను చాటుకున్నాడు వ‌ర్మ‌. థాంక్స్ టు బాలకృష్ణ అని వేశాడు వ‌ర్మ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -