- Advertisement -
కట్టుకున్న భార్య ఇంటికి రావడం లేదని ఆమెపై కాల్పులు జరిపాడు ఓ నటి భర్త.పూర్తి వివరాల్లోకి వెళ్తే…పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ నటి, గాయని అయిన రేష్మఖాన్ తన భార్య అయిన భర్త ఫైదాఖాన్ తో గొడవ పడి విడిగా ఉంటోంది.దీంతో అత్తారింటికి వెళ్లి భార్యను ఇంటికి రావాల్సిందిగా కోరాడు భర్త ఫైదాఖాన్ .
దానికి ఆమె నిరాకరించడంతో కోపం కంట్రోల్ చేసుకోలేక తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో రేష్మ అక్కడిక్కడే మరణించింది. దీంతో రేష్మ సోదరుడు అతడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.ఫైదాఖాన్ దుబాయ్‌లో పని చేసి ఇటీవలే పాకిస్థాన్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం.