Saturday, April 27, 2024
- Advertisement -

ఫైనల్ లో పాకిస్తాన్.. ఢీ కొట్టేదేవ్వరూ ?

- Advertisement -

వరల్డ్ కప్ లో మరో సంచలనం చోటు చేసుకుంది. అసలు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పాకిస్తాన్ జట్టు.. ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ లోకి దూసుకెళ్లింది. సూపర్ 12 లో భాగంగా ఇండియా, జింబాబ్వే జట్ల చేతిలో ఓడిపోయిన పాక్ జట్టు.. సెమీస్ రేస్ లో ఉన్న సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా నెదర్లాండ్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్ కు అదృష్టం కలిసొచ్చి సెమీస్ కు చేరింది. ఇక తాజాగా సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడిన పాక్ జట్టు.. కివీస్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది..

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాక్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ ఏ దశలోనూ భారీ స్కోర్ దిశగా ప్రయత్నించలేకపోయారు. కెప్టెన్ విలియమ్సన్ 42 బంతుల్లో 46 పరుగులు, మిట్చెల్ 35 బంతుల్లో 53 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు.. అది నుంచే ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించింది.

పాక్ ఆటగాళ్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ 42 బంతుల్లో 53 పరుగులు, ఓపెనర్ మహ్మద్ రిజ్వన్ 43 బంతుల్లో 57 పరుగులు, మహ్మద్ హరిస్ 26 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో దర్జాగా అడుగు పెట్టింది. ఇక ఫైనల్లో పాక్ జట్టుతో తలపడే జట్టు ఏది అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రేపు ( ఈ నెల 10న ) మరో ఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లండ్, టీమిండియా జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల బలా బలాల విషయానికొస్తే.. ఇండియా, ఇంగ్లండ్ రెండు జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి. కాబట్టి ఏ జట్టు ఫైనల్ కు చేరుతుందో ఊహించడం కష్టమనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -