Saturday, April 27, 2024
- Advertisement -

చరిత్ర సృస్టించిన ఇంగ్లాండ్.. ఫైనల్లో బిగ్ విక్టరీ !

- Advertisement -

ఆస్ట్రేలియాలో వేదికగా జరిగుతున్న టి20 వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లండ్ నిలిచింది. మెల్బోర్న్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పు సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో విజయం ఇంగ్లండ్ జట్టునే వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు ఏమాత్రం నిలువలేకపోయారు. షాయిన్ మసూద్ 28 బంతుల్లో 38 పరుగులు, బాబర్ ఆజమ్ 28 బంతుల్లో 32 పరుగులు, షధబ్ ఖాన్ 14 బంతుల్లో 20 పరుగులు చేయగా.. మిగిలిన బ్యాట్స్ మెన్స్ అంతా చేతులెత్తేశారు. .

ఇక 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆడుతూ పడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ బౌలర్లు కాస్త కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. లక్ష్యం చిన్నది కావడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఏమాత్రం తదపడకుండా విజయనికి చేరుకున్నారు. బెన్ స్టోక్స్ 49 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్టోక్స్ కు తోడు బట్లర్ 17 బంతుల్లో 26 పరుగులు, బ్రూక్ 23 బంతుల్లో 20 పరుగులు చేసి విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు ఒక ఓవర్ మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించి విశ్వ విజేతగా నిలిచింది. ఇక గతంలో 2010 టి20 వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లండ్ జట్టు 12 ఏళ్ల తరువాత 2022 లో మరోసారి టి20 వరల్డ్ కప్ సాధించి.. క్రికెట్ ప్రపంచంలో తమ జట్టుకు తిరుగులేదని నిరూపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -