Sunday, April 28, 2024
- Advertisement -

రామ్ ‘హైపర్’ ఫస్ట్ లుక్ ఎలా ఉంది అంటే?

- Advertisement -

నేను శైలజ సినిమా తో మంచి విజయం అందుకున్నాడు హీరో రామ్. అయితే ప్రస్తుతం రామ్ మంచి జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. రామ్ కి కందిరీగ లాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై ‘హైపర్‌’ అనేచిత్రం లో నటిస్తున్నాడు. తాజా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.

‘ప్రతి ఇంట్లో ఒకడుంటాడు’ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన తో వచ్చిన ఈ లుక్ ఫై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రామ్ నడిచినంటూ ఉండే ఈ లుక్ లో రామ్ చాల హ్యాండ్ సామ్ గా ఉన్నాడు. పేరు కు తగట్టే ‘హైపర్’ లోగో డిజైన్ బాగుంది. యాక్షన్ తో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

రామ్‌ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రమవుతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. రామ్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా నటించగా రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 30న విజయదశమి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -