Sunday, April 28, 2024
- Advertisement -

కెసిఆర్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు కొట్టారు

- Advertisement -

కెసిఆర్ ఎప్పుడూ ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనే మాట బాగా వాడుతూ ఉంటారు. తెలంగాణా ప్రభుత్వం ప్రస్తుతం చాలా ప్రతిస్టాత్మకంగా హరితహారం ప్రోగ్రాం ని చేబట్టింది. ఇందులో బాగా పనిచేసిన నేతలని ఎన్నుకుని మరీ కెసిఆర్ వారికి ప్రత్యెక బహుమతులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. నేతలు అందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ కి హరిత హారం లో చేసిన పనిని గీటురాయి  గా ఆయన ఎన్నుకోవడం విశేషం. ముఖ్యంగా నలుగురు తెరాస ఎమ్మేలఎలకి పదవులు దక్కబోతున్నాయి అని తెరాస లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బంగారు తెలంగాణా ని హరిత తెలంగాణా గా మార్చాలి అని కెసిఆర్ తీసుకున్న నిర్ణయం కొందరు నేతలకి చాలా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతోంది. సీఎంవో ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏ గ్రేడ్ సాధించిన ఎమ్మెల్యే ల పంట పండబోతోంది. కెసిఆర్ నేరుగా ఈ పథకాన్ని దగ్గరుండి సమీక్షించారు. వేలు నుంచి లక్షలు లక్షల నుంచి కోట్లు వరకూ మొత్తాలు నాటబడ్డాయి. సర్పంచ్ ల దగ్గర నుంచి మంత్రుల వరకూ అందరూ ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు.  సీఎంవో అధికారులు కూడా రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేసి కేసీఆర్ టేబుల్ మీద ఉంచుతున్నారు.

అధికారుల రిపోర్టులతో హరితహారంలో ఎవరి భాగస్వామ్యం ఎంత ఎవరి పనితీరు ఎలాఉంది అనే అంశంపై కేసీఆర్ ఓ క్లారిటీకి వచ్చారట.   ఇందులో బాగా పనిచేసిన ఓ నలుగురు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వారి పేర్లు ఒకటిరెండు రోజుల్లో ప్రకటిస్తారంటూ పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ఎమ్మెల్యేలతోపాటు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న మరికొందరు సీనియర్లకు కూడా హరితహారం వరం కాబోతున్నదట. ఈ రకంగా వారికి బహుమతిగా పదవులు కట్టబెట్టి ఉత్సాహంగా పనిచేసే విధంగా గిఫ్ట్ ఇస్తారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -