Monday, May 5, 2025
- Advertisement -

రాజ్ తరుణ్ తో నాకు ఓకే అంటున్న కుమారి

- Advertisement -
I am ready date with Raj Tarun : hebah patel

కుమారి 21ఎఫ్ తో టాలీవుడ్ ఆడియన్స్ మదిని మెలికలు పెట్టిన బ్యూటీ హేభా పటేల్. కుమారితో హిట్ ట్రాక్ ఎక్కింది ఈ భామ. ప్రస్తుతం నిఖిల్ కి జోడీగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంలో నటింస్తుంది. మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న హేభాపటేల్ కు… డేట్ కి వెళ్లాలంటే నిఖిల్.. రాజ్ తరుణ్.. ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారు?

అనే ప్రశ్నకు.. అమ్మడు ఇచ్చిన ఆన్సర్ షాకింగ్ గా ఉంది. నిజానికి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా వచ్చిన ఈ ప్రశ్నకు.. పాస్ అంటూ జవాబు దాటేసే అవకాశం ఉన్నా.. హేభ మాత్రం టక్కుమని  రాజ్ తరుణ్ అంటూ ఆన్సర్ ఇచ్చేసింది.. 

హేభా పటేల్ నటించగా హిట్ సాధించిన రెండు సినిమాల్లోనూ రాజ్ తరుణే హీరో. ఇప్పుడు డైరెక్టుగానే రాజ్ తరుణ్ తో డేట్ అంటూ హేభా పటేల్ తన మనసులో మాట చెప్పేయడంతో.. ఇద్దరి మధ్యా ఏదో ఉందంటు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వాదనలకు మరింత బలం వచ్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -